పామూరు సర్కిల్ కొత్త సీఐగా మాకినేని శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం ఆయన కనిగిరిలోని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త సీఐకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలతో సమన్వయం పాటించి, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.