లోన్ రికవరీ ఏజెంట్లు ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారమే వ్యవహరించాలని, రుణగ్రహీతలను ఒత్తిడికి గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ హెచ్చరించారు. కనిగిరి పోలీస్ స్టేషన్లో సోమవారం రాత్రి లోన్ రికవరీ ఏజెంట్లు, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం నిర్వాహకులకు ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆధార్ ద్వారా నగదు డ్రా చేసుకునే వారి వివరాలను దుర్వినియోగం చేయవద్దని సూచించారు.