రోడ్డు ప్రమాదంలో టిడిపి నేత మృతి

0చూసినవారు
రోడ్డు ప్రమాదంలో టిడిపి నేత మృతి
హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పీసీపల్లి మండల టీడీపీ సీనియర్‌ నాయకుడు వీరపనేని కేశవులు (52) మృతి చెందారు. గురువారం తన భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్‌ సమీపంలో నీళ్లట్యాంకర్‌ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేశవులు పీసీపల్లి మండలం చినవరిమడుగు గ్రామానికి చెందినవారు మరియు టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ, హైదరాబాదులో హోటల్‌, పీజీలు నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్