మార్కాపురం జిల్లాలోని కనిగిరి పట్టణంలో గార్లపేట రహదారిలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మూసివేశారు. గ్రహణం వీడిన తర్వాత, వేద పండితుల ఆధ్వర్యంలో ఆలయాన్ని సంప్రోక్షణ చేసి, మంగళవారం సాయంత్రం శుద్ధి చేశారు. అనంతరం భక్తులకు బాబా దర్శనానికి అనుమతి కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.