మార్కాపురం జిల్లా కనిగిరిలో బుధవారం జరిగిన
వైసీపీ బీఎల్ఎలు, పార్టీ శ్రేణుల శిక్షణా సదస్సులో నియోజకవర్గ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పాల్గొన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. జూన్ 15 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియలో బీఎల్ఎలు, బీఎల్డీలతో సమన్వయం చేసుకుంటూ ప్రతి బూత్లో ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని పిలుపునిచ్చారు.