మార్కాపురం జిల్లా పెదచెర్లోపల్లి మండలం వెంగలాపురం వద్ద పాలేటి గంగమ్మ తిరునాళ్ల మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన యువతి యువకుల డాన్స్ పోటీలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో, పోలీస్ సిబ్బంది పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేందుకు జనం అధిక సంఖ్యలో తరలి వచ్చారు.