మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రకాశం జిల్లా కనిగిరి మండలం తాళ్లూరు పంచాయతీలోని మాకేరువాగులో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరద కారణంగా గుండ్లపాలెం వెళ్లే రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. గుండ్లపాలెం వెళ్తున్న ఒక రైతు ట్రాక్టర్ తో వరదలో చిక్కుకున్నాడు. స్థానిక గ్రామస్తులు జేసీబీ సహాయంతో ట్రాక్టర్ ను ఒడ్డుకు చేర్చి, రైతును సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.