Feb 10, 2026, 04:02 IST/
అత్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపిన అల్లుడు
Feb 10, 2026, 04:02 IST
TG: మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అత్తకు అల్లుడు కరెంట్ షాక్ ఇచ్చి చంపాడు. ఈ ఘటన గార్ల మండలం సీతంపేట శివారు మంగళతండాలో జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్త కంసాలి (48)ని అల్లుడు రాజేశ్ (32) హతమార్చాడు. మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. రాజేశ్ దాడి నుంచి అతడి మామ, తల్లిదండ్రులు తప్పించుకున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.