Apr 19, 2026, 09:04 IST/
రాబోయే రెండు గంటల్లో ఈ జిల్లాల్లో వర్షం
Apr 19, 2026, 09:04 IST
తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే రెండు గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ మేరకు సిరిసిల్ల, జగిత్యాల, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడతాయని హెచ్చరించింది. అలాగే వికారాబాద్, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో సాయంత్రం వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక హైదరాబాద్లో సాయంత్రం లేదా రాత్రి వర్షం పడొచ్చని పేర్కొన్నారు. అటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.