టంగుటూరులో 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం

0చూసినవారు
టంగుటూరులో 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
ప్రకాశం జిల్లా టంగుటూరులో కొండపి ఫ్లై ఓవర్ వద్ద 41 బస్తాల రేషన్ బియ్యంతో కావలి వైపు వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనాన్ని టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు శనివారం అదుపులోకి తీసుకున్నారు. కిషోర్, చేవూరు వినోద్, దాసరి రాంబాబు, భాస్కర్ అనే నలుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు ఆయన తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్