ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని ఒంగోలు సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో బుధవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అధికారులు కార్యాలయంలోకి ప్రవేశించి కీలక పత్రాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఏ అంశంపై ఈ దాడులు జరుగుతున్నాయనే దానిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.