కొండపి పట్టణంలో బుధవారం జరిగిన డిజిటల్ మహానాడుకు కార్యకర్తలు రికార్డు స్థాయిలో తరలివచ్చారని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్చువల్ గా ఈ కార్యక్రమం జరిగిందని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఇంధనం పొదుపు పిలుపుమేరకు సీఎం చంద్రబాబు డిజిటల్ మహానాడును నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.