చిత్తూరు జిల్లాలో రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్యను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (ఏపీడబ్ల్యూజే) నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రకాశం జిల్లా కొండపి పోలీస్ స్టేషన్లో వినతి పత్రం సమర్పించారు. సంఘం నాయకుడు లింగయ్య మాట్లాడుతూ, నిజాయితీగా వార్తలు రాసే జగన్మోహన్ రెడ్డిని శ్రీగంధం స్మగ్లర్ కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. వార్తలు రాస్తే ఇలా చంపేస్తారా? అని ప్రశ్నిస్తూ, నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.