
పాక్-ఆప్ఘన్ సరిహద్దులో కాల్పులు.. ఇద్దరు సైనికులు మృతి
పాకిస్తాన్-ఆప్ఘనిస్తాన్ సరిహద్దులోని మారూఫ్ జిల్లాలో ఇరు దేశాల బలగాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తాలిబన్లు పాకిస్తాన్ మిలిటరీ పోస్టుకు నిప్పంటించడంతో పాటు, షోరాబాక్ ప్రాంతంలోని పాకిస్తాన్ ఔట్‌పోస్టును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు పాక్ సైనికులు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. తాలిబన్లు పాకిస్తాన్ మిలిటరీ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.




