ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో మద్యం తాగి ద్విచక్ర వాహనం నడిపిన ఒక వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ నాగమల్లేశ్వరరావు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. మద్యం తాగి వాహనాలు నడిపితే భారీ జరిమానాలు, జైలు శిక్ష పడే అవకాశం ఉందని, ప్రజలు మద్యం సేవించకుండా వాహనాలు నడిపి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.