ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఓవీ రోడ్డు కనుమళ్ల సమీపంలో అనుమతులు లేకుండా నిర్మించిన ఒక వెంచర్ ప్రహరీ గోడను ఒంగోలు ఉడా అధికారులు మంగళవారం కూల్చివేశారు. అనధికారికంగా లేఅవుట్ వేసి నిర్మించిన ఈ గోడను ధ్వంసం చేస్తూ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లాలో అక్రమ లేఅవుట్లు, వెంచర్లపై ఉక్కుపాదం మోపుతామని, నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు లేకుండా ప్లాట్లు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.