పాత సింగరాయకొండ గ్రామంలో కుక్కల బెడద

3చూసినవారు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ ఎస్సీ కాలనీ గ్రామంలో కుక్కల బెడద తీవ్రమైంది. రహదారుల్లో తిరుగుతున్న కుక్కలు ద్విచక్ర వాహనదారులను, పాదచారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వాహనాల వెంటబడి దాడికి యత్నిస్తున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యపై పంచాయితీ సిబ్బంది స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ట్యాగ్స్ :