జరుగుమిల్లి: కాలువలోకి దూసుకెళ్లిన బైక్

4చూసినవారు
ప్రకాశం జిల్లా జరుగుమిల్లి మండలం చింతలపాలెం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు యువకులు బైకుపై కామేపల్లికి వెళ్తుండగా, చింతలపాలెం సమీపంలో టర్నింగ్ వద్ద అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లారు. ఈ ఘటనలో యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాపట్ల ప్రాంతానికి చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్