ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం అయ్యవారిపాలెం గ్రామంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి కొండప్ప అనే వ్యక్తి మృతి చెందాడు. దెబ్బతిన్న రోడ్డు వల్లే ప్రమాదం జరిగిందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.