ప్రకాశం జిల్లా సింగరాయకొండ జాతీయ రహదారిపై గురువారం ఒక పాల ట్యాంకర్ ముందు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గుంటూరు నుంచి తిరుపతికి వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సు వెనుక భాగం, పాల ట్యాంకర్ ముందు భాగం భారీగా ధ్వంసమైనట్లు పోలీసులు తెలిపారు.