ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలోని వెల్టూరు గ్రామంలో శుక్రవారం రైతులకు పొలం పాస్ పుస్తకాలను ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గతంలో మాజీ సీఎం జగన్ ప్రతి దానిపై తన బొమ్మ వేసుకొని రైతులను ఇబ్బందులకు గురిచేశారని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ బొమ్మను తొలగించి, రాజముద్ర కలిగిన పాస్ పుస్తకాలను పంపిణీ చేసిందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు కూడా పాల్గొన్నారు.