ప్రకాశం జిల్లా కొండపిలో ఆదివారం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మర్రిపూడి మండలానికి చెందిన సాయి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.