ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయి సమీపంలోని జాతీయ రహదారిపై రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని 108 అంబులెన్సులో ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తి తమిళనాడుకు చెందిన విజయ్ కుమార్ అని పోలీసులు తెలిపారు. జరిగిన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.