ప్రకాశం జిల్లా సింగరకొండ తిరునాళ్ల నుంచి ఒంగోలు వెళ్లే భక్తులపై మంగళవారం తెల్లవారుజామున ఆర్టీసీ సిబ్బంది దౌర్జన్యానికి దిగారని ప్రయాణికులు ఆరోపించారు. బస్సు ఎక్కే క్రమంలో యూనిఫాం లేని సిబ్బంది మహిళలు, వృద్ధులను కిందకు నెట్టి బస్సును వేరే చోటికి తరలించారని ఆరోపించారు. దీంతో ఓ వృద్ధుడు 'నెడతావేంటి' అని ప్రశ్నించగా అతణ్ని దుర్భాషలాడారని తోటి ప్రయాణికులు తెలిపారు. పోలీసుల జోక్యంతో గొడవ సర్దుమణిగింది.