రామాయపట్నం పోర్టు పనులను పరిశీలించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ను ఒంగోలు పోలీసులు టంగుటూరు టోల్ ప్లాజా వద్ద అడ్డుకున్నారు. సినీ పక్కిలో మాజీ మంత్రి కాన్వాయ్ ని ఛేజ్ చేసిన పోలీసులు రామాయపట్నం వెళ్లకుండా అడ్డుకోవడంతో ఆగ్రహం చెందిన మాజీ మంత్రి నేషనల్ హైవేపై వెళ్లడం తప్పేనా అని పోలీసులను ప్రశ్నించారు. రామాయపట్నం వెళ్తే తప్పేముందని నిలదీశారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో వెనదిరిగి వెళ్లిపోయారు.