ప్రకాశం జిల్లా కొండపి మండలంలో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు తెలిపారు. కే ఉప్పలపాడు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని చిన్న వెంకన్నపాలెం, వెన్నూరు, చోడవరం, ముప్పవరం గ్రామాలకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.