కే అగ్రహారంలో పారిశుద్ధ్యం అడుగంటింది, ప్రజల ఆవేదన

0చూసినవారు
ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలోని పొన్నలూరు మండలంలోని కే అగ్రహారం గ్రామంలో పారిశుద్ధ్యం లోపించింది. పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గృహాల మధ్య కాలవల్లో నీరు నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. ఈ నీటి నిల్వ వల్ల దోమల బెడద పెరిగిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలకు నిధులు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, స్వచ్ఛఆంధ్ర ప్రచారానికి విరుద్ధంగా ఈ పరిస్థితి ఉందని స్థానికులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్