సింగరాయకొండ: జనావాసాల్లో మద్యం తాగుతున్న వారికి కౌన్సిలింగ్

52చూసినవారు
సింగరాయకొండ: జనావాసాల్లో మద్యం తాగుతున్న వారికి కౌన్సిలింగ్
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల పరిధిలో పోలీసులు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిని గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో జనావాసాల్లోనే మద్యం సేవిస్తున్న ఇద్దరిని శుక్రవారం గుర్తించి వారికి జరిమానా విధించారు. స్థానిక ఎస్సై వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వార్నింగ్ ఇచ్చారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించరాదని అలా సేవిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రజలను హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్