సింగరాయకొండ మండలంలోని శ్రీ ప్రసన్నాంజనేయ తిరుణాల మరియు రథోత్సవ కార్యక్రమం కోసం ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే భక్తుల కోసం 650 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు, ఇందులో 40 మంది ఎస్ఐలు ఉంటారని తెలిపారు. 69 సీసీ కెమెరాలు, తోపులాట నివారణకు బారికెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.