ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో మంతా తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు పొగాకు నారు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాలు తమకు ఆర్థికంగా తీవ్ర నష్టాలు కలిగించాయని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతన్నలు వేడుకుంటున్నారు. గురువారం అధికారులు నష్టంపై అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు.