ఆదివారం టంగుటూరు మండలం కొణిజేడులో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించగా, చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. కర్ణాటకకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నట్లు ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు. సోమవారం కేసు నమోదు చేసిన పోలీసులు, మృతుడిని గుర్తిస్తే టంగుటూరు పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.