ప్రకాశం జిల్లా సింగరాయకొండ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ ను సిఐ శ్రీహరి ప్రారంభించారు. కల్లకుంట్ల గోపి మెమోరియల్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలలో విజేతలకు రూ. 50 వేలు, ద్వితీయ స్థానానికి రూ. 30 వేలు, తృతీయ స్థానానికి రూ. 20 వేలు బహుమతులుగా అందజేస్తారు. ఈ కార్యక్రమంలో స్థానిక క్రీడాకారులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.