కొండపిలో పొంగిపొర్లుతున్న వాగులు నిలిచిపోయిన రాకపోకలు

7చూసినవారు
కొండపి - ఒంగోలు వెళ్లే రహదారులను అధికారులు మూసివేశారు. గురువారం వంకలు పొర్లడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. టంగుటూరు మార్గంలో పాలేటిపాడు జయవరం వద్ద, కామేపల్లి - టంగుటూరు వెళ్లేందుకు వావిలేడుపాడు వద్ద వాగులు పొంగడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. అనకర్లపూడి మీదగా వెళ్లేందుకు అట్లేరు కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో జిల్లా కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్