ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలో చోరీలకు పాల్పడ్డ ఓ దొంగను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 24వ తేదీన పరుచూరివారి పాలెం గ్రామంలోని ఓ ఇంట్లో దొంగ చోరీకి పాల్పడి, గృహ సంబంధిత పరికరాలతో పాటు కారు బ్యాటరీలు దొంగిలించాడు. దొంగను కోర్టులో ప్రవేశపెడతామని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.