ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు, ద్విచక్ర వాహనం ఢీకొని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణ సమీపంలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన ముగ్గురిని 108 అంబులెన్స్ ద్వారా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.