రాబోయే ఎన్నికలకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం

4చూసినవారు
రాబోయే ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని డిఎస్పి సత్యనారాయణ తెలిపారు. కందుకూరు డివిజన్ పరిధిలోని కొండపి, మర్రిపూడి, పొన్నలూరు పోలీస్ స్టేషన్లను సందర్శించిన ఆయన, నిరంతరం రౌడీ షీటర్లపై నిఘా ఉంచి, అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా చూస్తామని పేర్కొన్నారు. క్రైమ్ రిపోర్టులను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చినట్లు కూడా ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్