సింగరాయకొండ పోలీసులు బుధవారం కే బిట్రగుంట వద్ద శివ మహేష్ అనే యువకుడిని 15 కేజీల గంజాయితో అదుపులోకి తీసుకున్నారు. చెడు అలవాట్లకు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో మహేష్ గంజాయిని కొనుగోలు చేసి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.