
రెండు టిప్పర్ లారీలు సీజ్
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం వేంపాడు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్ లారీలను జరుగుమల్లి ఎస్సై సీజ్ చేశారు. మంగళవారం విధి నిర్వహణలో భాగంగా పెట్రోలింగ్ కు వెళ్లిన ఎస్ఐ ఈ అక్రమ రవాణాను గుర్తించారు. సీజ్ చేసిన లారీలను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.


































