Mar 18, 2026, 06:03 IST/
రీల్స్ మోజులో తండ్రి ప్రాణాలతో చెలగాటం
Mar 18, 2026, 06:03 IST
బెంగళూరులో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. వ్యాలీకావల్ పోలీస్ స్టేషన్ పరిధిలో, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఒక భారీ పార్శిల్‌ను కొరియర్ సెంటర్‌కు తీసుకువచ్చారు. పార్శిల్లో కదలికలను గుర్తించిన సిబ్బంది దాన్ని తెరిచి చూడగా, లోపల ఒక వృద్ధుడు కనిపించాడు. రీల్స్ తీయడం కోసమే ఇలా చేశామని, బస్సు టికెట్లు దొరక్కపోవడంతో ఈ ఫన్నీ ప్లాన్ చేశామని కుమార్తె వెల్లడించింది. దీంతో ఆమెపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.