అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో బుధవారం 2కె రన్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా అధికారులు పాల్గొని విజయవంతం చేశారు. నేటి సమాజంలో మహిళల ప్రాముఖ్యతను కీలక అధికారులు కొనియాడారు. భవిష్యత్తులో మహిళలు మరింత అభివృద్ధి చెందాలని అధికారులు ఆకాంక్షించారు.