అక్రమంగా దాచిన 65 గోవుల పట్టివేత

2చూసినవారు
మార్కాపురం జిల్లా కేంద్రంలో రహస్యంగా దాచి ఉంచిన సుమారు 65 గోవులను హిందూ సంఘ నాయకులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారావు సమాచారంతో పోలీసులు రక్షించారు. కృష్ణారావు మాట్లాడుతూ, అక్కడ కొన్ని గోవులను అక్రమంగా కోసి మాంసాన్ని విక్రయించారని ఆవేదన వ్యక్తం చేశారు. గోమాతగా పూజించే హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.