మార్కాపురంలో నిరుపయోగంగా నూతన పాఠశాల భవనం

3చూసినవారు
మార్కాపురం మండలం పెద్దనాగులవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మనబడి నాడు నేడు రెండో విడత కింద అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తయింది. అయితే, రెండు సంవత్సరాలుగా పాఠశాల ప్రారంభం కాకపోవడంతో నిర్మాణాలు నిరుపయోగంగా మారాయి. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ కూడా వాడకంలో లేకుండా పోయింది. ప్రభుత్వం కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన ఈ పాఠశాలను విద్యార్థులకు ఉపయోగపడేలా చూడాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్