మార్కాపురం నూతన సీఐగా షేక్ అల్తాఫ్ హుస్సేన్ నియమితులయ్యారు. ఈ మేరకు డీఐజీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో ఆయన పెద్ద దోర్నాల, అర్ధవీడు, రాచర్ల, పొదిలి ప్రాంతాల్లో ఎస్ఐగా పనిచేశారు. ఇటీవల సీఐగా ప్రమోషన్ పొందారు. నెల్లూరు జిల్లాలోనూ కొంతకాలం సేవలందించారు. మార్కాపురం గత సీఐ పి. సుబ్బారావును వీఆర్కు పంపారు.