మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్యకర్తలు 870 కేజీల భారీ కేక్ ను కట్ చేసి, వైసిపి ఇన్ ఛార్జ్ అన్నా వెంకట రాంబాబుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, అన్నా వెంకట రాంబాబును కార్యకర్తలు శాలువా, పూలమాలలతో సన్మానించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.