మార్కాపురం జిల్లా కేంద్రంలో మాజీ సైనికుల కోసం కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని ఆర్మీ హౌసింగ్ బోర్డు సొసైటీ అధ్యక్షుడు చిన్నయ్య, ఆర్డీవో ప్రభాకర్కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో ఉన్న మాజీ సైనికులకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్ అవసరమని, దీనికోసం సుమారు 50 సెంట్ల స్థలం కేటాయించి, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.