ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో మంగళవారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకువచ్చిన కారు మూసివేసి ఉన్న హోటల్‌లోకి చొచ్చుకుపోయింది. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం, కారు డ్రైవర్ మద్యం మత్తులోనే వాహనం నడిపినట్లు తెలుస్తోంది. ప్రజలు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.