మార్కాపురం గడియారం స్తంభం సెంటర్లో ట్రాఫిక్ అంతరాయం లేకుండా పూలు, పండ్లు, తోపుడు బండ్లను ఏర్పాటు చేయాలని సీఐ ఆల్తాఫ్ హుస్సేన్, ఎస్సై విశ్వనాథరెడ్డి సూచించారు. సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించి, కేటాయించిన పరిధిలోనే తోపుడు బండ్లు ఉండాలని, ఆర్టీసీ బస్సు నిలిపేందుకు అనువైన ప్రాంతాన్ని ఉంచాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని ఆదేశించారు. చిరు వ్యాపారులకు సమావేశం నిర్వహించి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.