ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి మార్కాపురం పట్టణంలో సోమవారం దివ్యాంగులు పాలాభిషేకం చేశారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించడంపై దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేశారు. మాటలు రాని ఓ దివ్యాంగుడు తన సైగలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపాడు. అనంతరం స్థానిక దివ్యాంగులతో కలిసి పాలాభిషేకం చేశారు.