ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలో బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి సతీమణి వసంత లక్ష్మి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పదిమంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రూ. 5.9 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. కూటమి ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలని ఆమె లబ్ధిదారులకు సూచించారు.