సీపీఎం మార్కాపురం జిల్లా కార్యదర్శిగా దగ్గుపాటి

2చూసినవారు
సీపీఎం మార్కాపురం జిల్లా కార్యదర్శిగా దగ్గుపాటి
మార్కాపురం ప్రెస్ క్లబ్‌లో ఆదివారం జరిగిన జిల్లా ప్లానరీ సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా దగ్గుపాటి సోమయ్య జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం, సయ్యద్ హనీ, వెంకటేశ్వర్లు, కేశవరావు, మాల్యాద్రి, రఫీ, బాల నాగయ్యలను జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఈ నూతన కమిటీ కృషి చేస్తుందని నాయకులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్